డ్రోన్‌లతో జూబ్లీహిల్స్‌‌లో పోలింగ్ పర్యవేక్షణ

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌లో పోలింగ్‌(Jubilee Hills By-Election)కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి కర్ణన్ తెలిపారు.

డ్రోన్‌లతో జూబ్లీహిల్స్‌‌లో పోలింగ్ పర్యవేక్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లో పోలింగ్‌(Jubilee Hills By-Election)కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి కర్ణన్ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసినట్లు వెల్లడించారు. డీఆర్‌సీ సెంటర్‌ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పోలింగ్ విధానాన్ని డ్రోన్‌లతో పర్యవేక్షిస్తామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ సిట్టింగ్​ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేశాయి. సిట్టింగ్​స్థానాన్ని తిరిగి గెలుచుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్తగా తమ ఖాతాలో మరో సీటును వేసుకోవడానికి, హైదరాబాద్ జిల్లాలో పాగ వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈనెల 11న మంగళవారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 4.01లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్​కేంద్రంలో సగటున 986 ఓటర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Next Story