మూడు రోజుల్లో పోలింగ్.. రాష్ట్రంలో ఐటీ, ఈసీ అధికారుల పంజా

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-27 03:58:41  IST  )

ఎన్నికల గడువు ముంచుకొస్తు్న్న వేళ తెలంగాణలో ఐటీ, ఈసీ సోదాలు మరోసారి కలకలం రేపాయి.

మూడు రోజుల్లో పోలింగ్.. రాష్ట్రంలో ఐటీ, ఈసీ అధికారుల పంజా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల గడువు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో ఐటీ, ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోదాలు మరోసారి కలకలం రేపాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాలేరులో భారీగా నగదు పట్టిబడింది. శ్రీరామ్ నగర్‌లో ఐటీ, ఈసీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో రూ.3.50 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని కృష్ణానగర్ లో ఓ ఇంట్లో భారీగా నగదు పట్టిబడింది. రూ.2.18 కోట్లను ఎస్ వోటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో నగదు గురించి పోలీసులు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి రూ.2.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story