కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కొండంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 05:44:40  IST  )

చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కొండంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ (Kodangal)లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.

కాసేపట్లో కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ఢిల్లీ పర్యటనకు పయనం

Next Story