కాసేపట్లో కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ఢిల్లీ పర్యటనకు పయనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 05:45:35  IST  )

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు.

కాసేపట్లో కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ఢిల్లీ పర్యటనకు పయనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం సీఎం సీఎం హైదరాబాద్‌లోని MCRHRD నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు బయలుదేరుతారు. ఉదయం 11.30 గంటలకు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఆయన నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30కి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు.

పార్టీలో హాట్ టాపిక్‌గా ఢిల్లీ టూర్..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మేరకు ఆయన ఏఐసీసీ (AICC) అగ్ర నేతలను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై నివేదిక అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి డిస్కస్ చాన్స్ ఉందని సమాచారం. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కృష్ణా-గోదావరి నీటి మళ్లింపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉంది.

కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కొండంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి

Next Story