బీఆర్ఎస్‌వి దిగజారుడు రాజకీయాలు.. మంత్రి సీతక్క

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-06 16:55:04  IST  )

బీఆర్ఎస్ పార్టీవి దిగజారుడు రాజకీయాలని.. ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్‌వి దిగజారుడు రాజకీయాలు.. మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీవి దిగజారుడు రాజకీయాలని.. ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో మంత్రి సీతక్క సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సీతక్క పార్టీలోకి ఆహ్వానించారు. రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామని.. కొన్ని యూట్యూబ్ చానల్‌లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అబద్ధాలు ఎంతో కాలం నిలవవు అని.. ప్రజలకు వాస్తవాలు తెలుసు అని అన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు అక్కసు వెల్లగకుతున్నారని.. రాష్ట్రంలోని సమస్యలకు బీఆర్ఎసే కారణమని విమర్శించారు. పదేళ్లు పట్టించుకోకపోవడంతోనే సమస్యలు తిష్ట వేశాయని.. తప్పుడు లెక్కలు చెప్పటంలో ఆ పార్టీ దిట్ట అని అన్నారు. 1,200 మంది అమరవీరులు అని చెప్పి.. తెలంగాణ వచ్చిన తర్వాత సంఖ్యను 400లకు కుదించారన్నారు. కులగణన సర్వేలో అధికారులు ఇంటింటికి వెళ్లి లెక్కలను తేల్చారన చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ స్పాన్సర్ లీడర్స్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.

Next Story