తెలంగాణలో అనుహ్యంగా మారిన పొలిటికల్ ట్రెండ్.. ఆ పార్టీ పుంజుకోవడంతో BRS అలర్ట్!

by Disha Web Desk 19 |
తెలంగాణలో అనుహ్యంగా మారిన పొలిటికల్ ట్రెండ్.. ఆ పార్టీ పుంజుకోవడంతో BRS అలర్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ ట్రెండ్‌లు క్రమంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నాళ్లు బీఆర్ఎస్​వర్సెస్​బీజేపీ అనే స్థాయిలో ఫైట్ కొనసాగింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్​గ్రాఫ్​పెరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్​వర్సెస్​కాంగ్రెస్​అనే స్థాయిలో రాజకీయం కొనసాగుతున్నది.

బీఆర్ఎస్​పార్టీ కూడా బీజేపీని లైట్ తీసుకొని, కాంగ్రెస్‌పై ఫోకస్ పెంచింది. హస్తం పార్టీకి పోటీగా గులాబీ నేతలు రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న సభలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్​పార్టీ సభలను గమనిస్తున్న బీఆర్ఎస్, నిర్లక్ష్యం వహిస్తే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని గ్రహించింది.

గతంలో పోల్చితే కాంగ్రెస్​పార్టీ సభలకు జనాలు స్వచ్ఛందంగా రావడం షురూ అయింది. దీంతో కాంగ్రెస్​వేవ్‌ను అడ్డుకునేందుకు స్వల్ప వ్యవధితోనే బీఆర్ఎస్​కూడా అదే ప్రాంతాలలో రాజకీయ సభలు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నది. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో ఇదే కొనసాగుతున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభలు, స్ట్రీట్​కార్నర్​మీటింగ్‌లు నిర్వహించిన కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్​ఆ ఏరియాలో సభ పెట్టి జనాలకు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నది.

కాంగ్రెస్​వైపు జనాలు మళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. స్వయంగా కీలక మంత్రులు హరీష్​రావు, కేటీఆర్‌లు కాంగ్రెస్​వెనక బీఆర్ఎస్ సభలకు ప్లాన్​చేయడం గమనార్హం. అధికార పార్టీగా ఉండి నష్టపోతామనే ఇండికేషన్‌తోనే ఆ ఇద్దరు మంత్రులు రాజకీయ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది

పార్టీకి నష్టం జరగకుండా...?

గత నెల 24వ తేదిన కాంగ్రెస్​పార్టీ ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి మయూరి సెంటర్ పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీసి జనాలను ఆకట్టుకున్నది. ఆ తర్వాత మయూరీ సెంటర్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను ఏర్పాటు చేయగా, దాదాపు 50 వేల మందికి పైగా వచ్చినట్లు కాంగ్రెస్​నేతలు ప్రచారం చేశారు.

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్​పార్టీ గ్రాఫ్​పెరిగిందని గ్రహించిన బీఆర్ఎస్.. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్​ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రత్యేక సభను నిర్వహించారు. కాంగ్రెస్​పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఏప్రిల్ 26 కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. కలెక్టరేట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, అంబేద్కర్ చౌరస్తా వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఇది జరిగిన ఒకటి రెండ్రోజుల్లో బీఆర్ఎస్​పార్టీ ఇన్​చార్జీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఇతర సీనియర్​నాయకుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ను డైవర్షన్​చేసేందుకు ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 28న కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. నల్లగొండ క్లాక్ టవర్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఆధరణ పెరిగింది. దీన్ని గమనించిన ఆ జిల్లా మంత్రి జగదీష్​రెడ్డి హై కమాండ్ ఆదేశాలతో సూర్యాపేట్, నల్లగొండ, మిర్యాలగూడలో బీఆర్ఎస్​పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించారు.

ఏప్రిల్ 30 మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్​పార్టీ నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత వెంటనే మంత్రి కేటీఆర్​ఈ నెల 6 మహబూబ్​నగర్లో ఐటీ టవర్​ప్రారంభోత్సవం చేసి రాజకీయ విమర్శలు చేశారు. ఈ సభలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​టీపీసీసీ చీఫ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వరంగల్, ఉమ్మడి మెదక్, కరీంనగర్ లో కాంగ్రెస్​పార్టీ ర్యాలీలు, సభలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీష్​రావు, కేటీఆర్‌లు అభివృద్ధి పేరిట రాజకీయ ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బీజేపీపై మౌనం..?

గత రెండేళ్ల నుంచి బీజేపీపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసిన బీఆర్ఎస్​రెండు నెలల నుంచి ఆ పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, సర్పంచ్‌ల నుంచి మంత్రుల వరకు కాంగ్రెస్​పార్టీపైనే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్​కేడర్​బలోపేతం అవడంతో పాటు, కర్ణాటక రిజల్ట్స్‌తో బీఆర్ఎస్​పార్టీలో కాస్త అలజడి మొదలైందని, అందుకే కాంగ్రెస్‌పైనే బీఆర్ఎస్​ఎక్కువ ఫోకస్​పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read More... బిగ్ న్యూస్: స్పీడ్ పెంచిన T-బీజేపీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘‘మేనిఫెస్టో’’ కసరత్తు షురూ!


Next Story