మోడెం బాలకృష్ణకు రాజకీయ ఖైదీల విడుదల కమిటీ సంతాపం

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌(Chhattisgarh Encounter)లో మృతిచెందిన మావోయిస్టు కీలక నేత మోడెం బాలకృష్ణ(Modem Balakrishna) అలియాస్‌ మనో‌జ్‌కు రాజకీయ ఖైదీల విడుదల కమిటీ సంతాపం ప్రకటించింది.

మోడెం బాలకృష్ణకు రాజకీయ ఖైదీల విడుదల కమిటీ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌(Chhattisgarh Encounter)లో మృతిచెందిన మావోయిస్టు కీలక నేత మోడెం బాలకృష్ణ(Modem Balakrishna) అలియాస్‌ మనో‌జ్‌కు రాజకీయ ఖైదీల విడుదల కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం బల్ల రవీంద్రనాథ్ పేరిట ప్రకటన విడుదల అయింది. వివరాల్లోకి వెళితే.. ‘చంచల్ గూడ జైలులో రాజకీయ ఖైదీగా ఉంటూ తన సహచర కామ్రేడ్స్‌తో 1990లో 'రాజకీయ ఖైదీల హక్కుల పోరాటం' కోసం బాలకృష్ణ జంగ్ సైరన్ మోగించారు. సాధారణ, రాజకీయ ఖైదీల హక్కులతో పాటు వారి డిమాండ్లను సాధించారు. జైలు నుండి విడుదలై తిరిగి విప్లవోద్యమంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన ఆయన ఇలా బూటకపు ఎన్‌కౌంటర్‌లో కన్నుమూయడం ఆవేదన కలిగిస్తోంది. ఆయనకు రాజకీయ ఖైదీల విడుదల కమిటీ పక్షాన జోహార్లు అర్పిస్తున్నాము’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, హన్మకొండలోని కాజీపేట మండలం మడికొండకు చెందిన మోడెం బాలకృష్ణపై మొత్తం రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story