- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ అధికారానికి చిత్తశుద్ధితో ఉన్నాం: భట్టి విక్రమార్క
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఈ వర్గాలకు రాజకీయ అధికారం కల్పించాలని కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసి కార్యకర్తల సమ్మేళనంలో (Adivasi Training) భట్టి విక్రమార్క మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల వారు తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతకాలనేది కాంగ్రెస్ లక్ష్యం అని ఈ వర్గాలను దృష్టిలో పెట్టుకునే దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ, ఎస్సీ, బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. వెనుకబడిన వర్గాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షమ పథకాలను రూపొందిస్తోందన్నారు.
గతంలో బీఆర్ఎస్ దాష్టికాలు:
వెనుకబడిన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ గరిష్ట పరిమితి చట్టం చేసిందని, భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ (congress) ప్రభుత్వం మాత్రమే అని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 6.70 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేస్తే ఆ భూములను దున్నుకోకుండా అడ్డుకోవడమే కాకుండా మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి బీఆర్ఎస్ దాష్టికాలకు పాల్పడిందని విమర్శించారు. గిరిజనుల కోసం ఇటీవలే ఇందిరాగాంధీ సౌర గిరిజల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకానికి రూ. 12,500 కోట్లు కేటాయించామన్నారు. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈ సబ్ ప్లాన్ కు రూ. 17,169 కోట్లు కేటాయిస్తే గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పదేళ్ల పాటు గాలికి వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదని ఉన్న నిధులు కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేపట్టిన పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో హస్తగతం చేసుకున్నారన్నారు. చెప్పినట్లుగా తాము అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకువచ్చామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పై గత పదేళ్లు బీఆర్ఎస్ ఆలోచన చేయలేదు. కానీ మేము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను పక్కా భవనాలతో నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు.






