Minister Ponnam : 317జీవో పై రాజకీయ విమర్శలు తగదు : మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |

ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో రాజకీయ లబ్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)317జీవోపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)అన్నారు.

Minister Ponnam : 317జీవో పై రాజకీయ విమర్శలు తగదు : మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో రాజకీయ లబ్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)317జీవోపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో 317 జీవో పై బండి సంజయ్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సమంజసంగా లేదన్నారు.

317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌజ్ కేసుల వారిని , హెల్త్ , మ్యూచువల్ కి సంబంధించిన వారిని బదిలీ చేశామని పొన్నం గుర్తు చేశారు. స్థానికత్వం అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. దానికి సంబంధించి రాబోయే శాసన సభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని ఎన్నికల హామీ మేరకు 317 జీవో సమస్యలు పరిష్కారం చేస్తామని..ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులంగా మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచండని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండని కోరారు.

ఇప్పటికే 317జీవోపై దామోదర రాజనర్సింహ నాయకత్వంలో శ్రీధర్ బాబు, నేను అనేక సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తున్నామన్నారు.ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారంలో ఉన్నందునా.ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉండేలా చేసేలా బాధ్యత మాదని పొన్నం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు హామీనిచ్చారు.

Next Story