Political Bettings: కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ఐపీఎల్ ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్ లు!

by Prasad Jukanti |

ఐపీఎల్ ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్ లు!

Political Bettings: కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ఐపీఎల్ ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్ లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కాకరేపుతున్నది. కేబినెట్ విస్తరణ కోసం అవసరమైన కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం ఏక్షణమైనా కొత్త అమాత్యుల జాబితా విడుదల చేయబోతున్నట్లు అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఓ వైపు కేబినెట్ విస్తరణకు అధిష్టానం రంగం సిద్ధం చేసుకోగా మరో వైపు తమ సామాజిక వర్గాలకు మంత్రి పదవి కావాలంటూ పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్లు తెరపైకి తేవడం హస్తం పార్టీలో చర్చనీయాశం అవుతున్నది. దీంతో అంతిమంగా కేబినెట్ లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై బెట్టింగ్ లు మొదలు కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఐపీఎల్ ను మరిపించేలా పొలిటికల్ బెట్టింగ్ లు:

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతున్నా అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు అధిష్టానం సైతం పచ్చజెండా ఊపింది. ఉగాది ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా మంత్రి పదవులు వరించబోయేది ఎవరికి అనేదానిపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవిపై తమకు అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా వచ్చిందని పలువురు నేతలు ఇప్పటికే తమ అనుచరులకు సంకేతాలు ఇవ్వడంతో జిల్లాల్లో మా నేతకంటే మా నేతకే ఛాన్స్ దక్కబోతున్నదంటూ ఆయా జిల్లాల్లోని సెకండ్ క్యాడర్ లీడర్లు జోరుగా బెట్టింగ్ కాస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ వైపు ఐపీల్ బెట్టింగ్ లు జోరుగా సాగుతుంటే వాటిని మరిపించే రీతిలో మంత్రిపదవులపై రాజకీయ బెట్టింగ్ లు (Political Bettings) ఊపందుకుంటున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవిపై పీటముడి:

మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నది. ఇప్పటికే జిల్లా సమీకరణాలు, సామాజిక నేపథ్యాలతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఓ అంచనాకు వచ్చిన అధిష్టానంకు ఇప్పుడు పరిస్థితి జటిలంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో తమకు అన్యాయం జరిగిందని మంత్రివర్గ విస్తరణలోనైనా తమకు న్యాయం చేయాలని మాదిగ ఎమ్మెల్యేలు తాజాగా డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్ లో ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండాలని లంబాడా ఎమ్మెల్యేలు కోరుతుండగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం రేస్ లో ఉండటం, ఉమ్మడి ఆదిలాబాద్ లో ఓ వైపు వివేక్, మరో వైపు ప్రేమ్ సాగర్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తుండటం సిట్యుయేషన్ ను మరింత సీరియస్ గా మారుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తుండటంతో అంతిమంగా కేబినెట్ లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.

Next Story