- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారా?.. క్రాస్ చెక్ చేసుకోకపోతే జరిగేది ఇదే!
ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు.. టైప్ చేసే ఓపిక లేనప్పుడు కొందరు వాట్సాప్‌లో వాయిస్ మెసేజులు(WhatsApp Voice Message) పంపిస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు.. టైప్ చేసే ఓపిక లేనప్పుడు కొందరు వాట్సాప్‌లో వాయిస్ మెసేజులు(WhatsApp Voice Message) పంపిస్తుంటారు. దీని వల్ల టైమ్ సేవ్ అవుతుందని.. చెప్పాల్సిన విషయం కూడా ఈజీగా చెప్పేయొచ్చని భావిస్తుంటారు. అయితే.. వాయిస్ మెసేజుల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని పోలీసులు(Telangana Police) హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా కీలక ట్వీట్ పెట్టారు. ‘తెలియనివారికి వాయిస్ మెసేజ్‌లు అస్సలు పంపించకండి. మీ వాయిస్‌ను క్లోనింగ్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. మీ సన్నిహితులకు కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ కొత్త నెంబర్ల నుంచి మీ సన్నిహితుల వాయిస్‌తో కాల్ చేస్తే ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అవగాహన కోసం ఓ వీడియోను కూడా పోలీసులు పోస్టు చేశారు.






