బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధం.. తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ టెన్షన్

by Ajay Maddhiboyina |

తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీ బాల్కసుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టారు. పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుంటున్నారు.

బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధం.. తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీ బాల్కసుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టారు. పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉదయం నుండి సుమన్ అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో బాల్క సుమన్ ఆ వార్తలను ఖండించారు. మీడియా సంస్థల్లో తాను అరెస్ట్ అయ్యానంటూ వస్తున్న వార్తలు అసత్యం అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

తాను ఎక్కడికీ వెళ్లలేదని తెలంగాణ భవన్ లోనే ఉన్నానని తెలిపారు. అరెస్ట్ చేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవల బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. రీసెంట్ గా సుమన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడంలేదని బీఆర్ఎస్ నేతలే స్వయంగా మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి ఆఫీసులను ధ్వసం చేయాలని అన్నారు. రైలు పట్టాలని కోసేయాలని పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులు అందగా అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

Next Story