- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gali Janardhan Reddy: చంచల్ గూడ జైలు నుంచి గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరుకు తరలింపు
గాలి జనార్దన్ రెడ్డిని చంచల్‌గూడ నుంచి బెంగళూరుకు తరలించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషి (Obulapuram Illegal Mining Case) గాలి జనార్ధన్ రెడ్డిని (Gali Janardhan Reddy) పోలీసులు బెంగళూరుకు తరలించారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డిపై బెంగళూరులో పలు కేసులు నమోదు అయ్యారు. ఈ కేసుల విచారణ నిమిత్తం తాజాగా ఆయనను పీటీ వారెంట్ పై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. కాగా ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పలువురికి నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో దోషులందరిని అధికారులు జైలుకు తరలించారు. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గాలి జనార్ధన్ రెడ్డి సహా నలుగురు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ నిన్న కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Next Story






