‘‘అమ్మనాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్’’.. కంటతడి పెట్టిస్తోన్న సాత్విక్ సూసైడ్ లెటర్

by Disha Web Desk |
‘‘అమ్మనాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్’’.. కంటతడి పెట్టిస్తోన్న సాత్విక్ సూసైడ్ లెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు నార్సింగ్‌లో శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్యకు ముందే సాత్విక్ రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్‌లో స్వాతిక్ తన ఆవేదనను వెల్లగక్కిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

‘‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. మిమ్మిల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు పెట్టే టార్చర్‌తో ఆత్మహత్య చేసుకుంటున్నా. కృష్టా, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. అమ్మనాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్’’ అని సూసైడ్ లెటర్ రాసి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న స్వాతిక్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి.. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి తరలిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మెహరించారు.


Next Story

Most Viewed