- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fine Rice: బోనస్ కోసమే.. ఏపీ - తెలంగాణ బార్డర్‌లో పోలీసుల చెక్ పోస్టులు
ఏపీ నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా నల్గొండ జిల్లా పోలీసులు అడ్డుకుంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ నుంచి తెలంగాణకు (Grain) ధాన్యం రాకుండా నల్గొండ జిల్లా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ మేరకు ప్రస్తుతం (AP Telangana Border) తెలంగాణ బార్డర్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఆంధ్ర నుంచి వస్తున్న వరి ధాన్యం (lorries) లారీలను పోలీసులు పట్టుకున్నారు. సుమారుగా 2200 ధాన్యం బస్తాలు, ఏడు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న పలు దళారులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న (Rice bonus) బోనస్ కాజేసేందుకు ధాన్యం అక్రమ రవాణాకు కేటుగాళ్లు తెరలేపినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదనీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ - తెలంగాణ సరిహద్దులైన కోదాడ, వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, తాజాగా జరిగిన అక్రమ రవాణపై నల్గొండ డిఎస్పీ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






