Flash : రాష్ట్రంలో ఉద్రిక్తత.. సీఎం నివాసం వద్ద భారీ బందోబస్త్

by Naga Rani Yarlagadda |

కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.

Flash : రాష్ట్రంలో ఉద్రిక్తత.. సీఎం నివాసం వద్ద భారీ బందోబస్త్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏ క్షణానైనా సీఎం నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉండటంతో సీఎం రేవంత్ నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం ఇంటికి వెళ్లే మూడు దారుల్లోనూ పోలీసులు అడుగడుగునా కాపు కాస్తున్నారు.

Next Story