- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sperm Donation: వీర్యదానం రూ. 4 వేలు! హైదరాబాద్‌లో స్పెర్మ్ క్లినిక్‌పై పోలీసుల దాడులు
సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం (Sperm Donation) ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని స్పెర్మ్ క్లినిక్‌లపై దాడులు చేపట్టేందుకు సిద్దమైనట్లు కన్పిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో (Sperm Clinic) స్పెర్మ్ క్లినిక్‌పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌లో తనిఖీలు చేపట్టి.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరిస్తున్నారు. అలాగే స్పెర్మ్ డొనేటర్లకు రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ క్లినిక్‌కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ క్లినిక్‌పై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, గతంలో తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ (Test Tube Baby Center) టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే.. వేరే వారి వీర్యకణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చిన డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోగా, శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో తాజాగా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.






