- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూఢనమ్మకాలపై పోలీసు అధికారి అవగాహన: కొనసాగుతున్న సోషల్ మీడియా రచ్చ
సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలపై పోరాడాలనే ఉద్దేశంతో ఒక పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలపై పోరాడాలనే ఉద్దేశంతో ఒక పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రోడ్ల మీద కనిపించే నిమ్మకాయలు, కొబ్బరికాయలను చూసి భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అయితే.. ఒక వర్గం నుండి ప్రశంసలు అందుకుంటుండగా, మరోవర్గం దీనిని మతపరమైన కోణంలో విమర్శిస్తోంది.
అసలేం జరిగింది?
రోడ్ల కూడళ్లలో, వీధుల చివరన మంత్రించినట్లుగా భావించే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలను ఉంచడం మన దగ్గర తరచుగా చూస్తుంటాం. వీటిని దాటడానికి జనం భయపడుతుంటారు. దీనిపై సదరు పోలీసు అధికారి స్పందిస్తూ.. "ఇవన్నీ కేవలం భ్రమలు మాత్రమే, వీటి వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదు. రోడ్ల మీద పడేసిన నిమ్మకాయలను తొక్కడం వల్ల ఏమీ కాదు, కావాలంటే వాటిని కోసుకుని రసం తాగొచ్చు, కొబ్బరికాయలను తినొచ్చు." అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ధైర్యం నింపడానికి, అనవసరపు భయాలను తొలగించడానికి ఆయన ఈ విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
మతపరమైన వివాదం..
అయితే, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. కొన్ని హిందూ సంఘాలు పోలీసు అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. "పోలీసు అధికారి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయాలనుకోవడంలో తప్పు లేదు కానీ, కేవలం హిందూ ధర్మంలోని ఆచారాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇతర మతాల్లోని మూఢనమ్మకాలపై కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది హిందూ సంప్రదాయాలను కించపరచడమేనని వారు వాదిస్తున్నారు. మరోవైపు, అధికారి వ్యాఖ్యలను నెటిజన్లు సమర్థిస్తున్నారు. చదువుకున్న వారు కూడా ఇలాంటి మంత్రతంత్రాలను నమ్మి భయపడటం సరికాదని, అధికారి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని వారు అంటున్నారు. రోడ్లపై ఇలాంటి వస్తువులు వేయడం వల్ల అపరిశుభ్రత పెరగడమే కాకుండా, వాహనదారులు సడన్ బ్రేకులు వేసి ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు.






