Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో పోలీసుల లాఠీచార్జ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-11 12:10:51  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో పోలీసుల లాఠీచార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అపెక్స్ స్కూలు వద్ద బూత్‌లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసులు కలుగజేసుకుని గుమిగూడొద్దని చెప్పారు. దీంతో స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ బూత్‌లు 4, 5, 6, 7 వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు.. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలెంజ్‌గా తీసుకున్నప్పటికీ.. పోలింగ్‌ శాతంలో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. ఉదయం నుంచి మందకొడిగానే కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఎన్నికల సంఘం అవగాహన కల్పించినా ఓటర్లు ఇళ్ల నుంచి కదలడం లేదు. బస్తీల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ స్లోగానే నడుస్తోంది. లంచ్‌ వరకు పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత పెద్దగా పెరగలేదు. సాయంత్రం 3 గంటల వరకు 40.2 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మరో గంటలో.. అంటే సరిగ్గా సాయింత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియనుంది.

Next Story