- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సృష్టి’ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి
‘సృష్టి’ కేసులో గోపాలపురం (Gopalapuram) పోలీసుల దర్యాప్తు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం (Gopalapuram) పోలీసుల దర్యాప్తు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Doctor Namrata)తో సహా మొత్తం 26 మందిని అరెస్ట్ అయ్యారు. అయితే, సరోగసి ముసుగులో ఇప్పటి వరకు నమ్రత సుమారు 50 మంది బాధితుల దగ్గర రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా వెల్లడైంది. అదేవిధంగా మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులు సేకరించినట్లుగా తేలింది. ప్రస్తుతం ఆ పిల్లలను శిశువిహార్‌కు తరలించే యోచనలో పోలీసులు ఉన్నారు.
ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి పెద్ద ఎత్తున పిల్లలను విక్రయించినట్లుగా దర్యాప్తులో బయటపడింది. వారి నుంచి రూ.5 లక్షలకు విక్రయించి తన వద్దకు వచ్చిన క్లయింట్లకు రూ.50 లక్షలకు డాక్టర్ నమ్రత విక్రయించినట్లుగా తెలిసింది. అలా ఇప్పటి వరకు 80 మంది పిల్లలను అమ్మినట్లుగా పోలీసులు వెల్లడించారు. గర్భిణులకు డబ్బు ఆశచూపి నెలలు నిండక ముందే నమ్రత సర్జరీలు చేశారని నిర్ధారించారు. ఈ మేరకు ఆమె బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి ‘సృష్టి’ కేసులో తల్లులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.






