- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అధికార పార్టీ ఎమ్మెల్యే వాహనం తనిఖీ చేసిన పోలీసులు
అధికార పార్టీ ఎమ్మెల్యే వాహనం తనిఖీ చేసిన పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో వాహనాన్ని తనిఖీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అదే రోజు రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అభ్యర్థులందరూ కోడ్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు జరిగే ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. బ్యాలట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుందని చెప్పారు. ట్వీట్






