- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL-2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. బీసీసీఐ ఆరోపణలపై పోలీసుల ఎంక్వైరీ
ఐపీఎల్-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (IPL-2025) ఐపీఎల్-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసిద్ధ క్రికెట్ లీగ్‌లో అవినీతికి పాల్పడేలా, ప్రలోభపెట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీసీసీఐ (BCCI) అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) ఇప్పటికే లీగ్‌లోని 10 జట్లను హెచ్చరించింది. 5 హాట్ ఫేవరేట్ టీమ్ ఫ్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు తాజాగా బీసీసీఐ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టినట్లు సమాచారం.
ఆధారాలు ఇవ్వాలని బీసీసీఐని పోలీసులు కోరారు. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌కి చెందిన ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసుల అనుమానిస్తున్నారు. అయితే (Cricbuzz) క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త టోర్నమెంట్‌లో పాల్గొనే వారితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఏసీఎస్‌యూ విశ్వసిస్తోంది. హైదరాబాద్ బిజినెస్ మెన్ గతంలో కూడా ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఏసీఎస్‌యూ హెచ్చరించింది.






