Big Breaking: హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-18 06:22:27  IST  )

హైదరాబాద్‌లో భారీ పేలుళ్లను పోలీసులు భగ్నం చేశారు...

Big Breaking:  హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో భారీ పేలుళ్ల(Blasts)ను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్.. నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్ చేసింది. నగరంలో విధ్వంసాలకు కుట్ర చేసిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ , సయ్యద్ సమీర్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ‘‘పేలుళ్లకు ఎవరు ప్లాన్ చేశారు. ఎందుకు చేస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రదారి ఎవరు?. అసలు కారణాల ఏంటి, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా..?.’’ అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాగా పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలతో ఉగ్రవాదుల పేర్లు వింటేనే జనం హడలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రమూలాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది. గతంలోనూ హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని తెలియడంతో నగర వాసుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఇద్దరేనా.. ఇంకెవరైనా ఉన్నారా అనే ఆందోళన కొనసాగుతోంది. ఉగ్రమూకలను పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చాలా పటిష్టంగా, అలర్ట్‌గా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దుండగుల విచారణ తర్వాత పూర్తి వివరాలు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

Next Story