- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCU విద్యార్థులపై లాఠీచార్జి చేయలేదు: పోలీసుల వివరణ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) భూముల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) భూముల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యార్థుల నిరసనను పోలీసులు అడ్డుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీలకతీతంగా అందరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై స్థానిక డీసీపీ(DCP) వివరణ ఇచ్చారు. HCU విద్యార్థులపై లాఠీచార్జి చేయలేదని స్పష్టం చేశారు. విద్యార్థులను కావాలనే కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ప్రభుత్వ అధికారులపైనా దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్(ACP Srikanth) గాయపడ్డారని అన్నారు. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన ఆ ఇద్దరికి క్యాంపస్‌తో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
ఇదిలా ఉండగా.. HCUలో భూమిపై తెలంగాణ ప్రభుత్వ(Telangana Govt) అధికారిక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి తమదే అంటూ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నది. ప్రాజెక్ట్‌లో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని స్పష్టం చేసింది. కోర్టులోనూ భూమి ప్రభుత్వానిదే అని తేలింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు భూమి కేటాయించారు. న్యాయపోరాటంతో భూమి దక్కించుకున్నాం. సర్వేలో అంగుళం భూమి కూడా HCUది కాదని తేలింది. ఏం చేసినా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. కొందరు విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.






