- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Bhavan: తెలంగాణ భవన్ ఎదుట భారీగా పోలీసులు.. ఎందుకు వచ్చారంటే?
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్ (Telangana Bhavan) ఎదుట పోలీసులు మోహరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్ (Telangana Bhavan) ఎదుట పోలీసులు మోహరించారు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నిన్న రాత్రి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు అనంతరం ఆయన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. ఖండిస్తూ కాంగ్రెస్ (Congress) శ్రేణులు తెలంగాణ భవన్ ముట్టడికి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం భవన్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్‌లు నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు ముట్టడికి వస్తే.. బీఆర్ఎస్ శ్రేణులు సైతం అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.






