- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పోలీసుశాఖ కీలక నిర్ణయం.. MP రఘునందన్‌రావుకు సెక్యూరిటీ పెంపు
తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao)కు సెక్యూరిటీ పెంచాలని నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao)కు సెక్యూరిటీ పెంచాలని నిర్ణయించింది. ఇటీవల రఘునందన్‌కు మావోయిస్టుల(Maoists) బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రఘునందన్‌రావుకు భద్రత అవసరమని నిర్ధారణకు వచ్చారు. ఇకపై రఘునందన్ పర్యటనలో సాయుధ పోలీసులతో ఎస్కార్ట్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా, రఘునందన్‌రావును మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడం కలకలం రేపింది. నేరుగా ఆయన ఫోన్‌కు కాల్ చేసి బెదిరించారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఆయన వేదికపై ఉండగా గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్‌కాల్ రాగా.. ఎంపీ వ్యక్తిగత సహాయకుడు ఫోన్ ఎత్తారు. అవతలి వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ.. ‘‘మావోయిస్టు నాయకుడిని మాట్లాడుతున్నా.. ఈ రోజు సాయంత్రంలోపు మీ ఎంపీ అంతుచూస్తాం. మధ్యప్రదేశ్ నుంచి కొందరు బయల్దేరారు. రాత్రి 12 గంటల వరకు వస్తారు. మీ సార్‌ని జాగ్రత్తగా ఉండాలని చెప్పు’’ అని బెదిరింపులకు దిగాడు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన రఘునందన్ రావు.. విషయాన్ని తెలంగాణ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరపడంతో పాటు తనకు సెక్యూరిటీ పెంచాలని రిక్వెస్ట్ చేశాడు. విచారణ పూర్తయిన నేపథ్యంలో సెక్యూరిటీ పెంచాలనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.






