హైదరాబాద్‌లోని ఆ మూడు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లోని ఆ మూడు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు పబ్స్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రాత్రి అనూహ్యంగా స్నిపర్ డాగ్స్‌తో కలిసి మొదటిసారి జూబ్లీహిల్స్‌లోని పలు పబ్బుల్లో దాడులు నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తుండటంతో నగరంలోని పబ్స్‌లో విస్తృతంగా మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగబోతున్నాయని వచ్చిన సమాచారంతో తనిఖీలు ప్రారంభించారు. పక్కా సమాచారంతో ప్రధానంగా మూడు పబ్బులపై పోలీసులు ఫోకస్ చేసినట్లు సమాచారం. తనిఖీల అనంతరం పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. కాగా, నగరంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఇక నుంచి జరగటానికి వీళ్లేదని, విక్రయాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారి హస్తం ఉన్న వదలొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed