- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసుల తనిఖీలు.. 9.3 కిలోల గంజాయి పట్టివేత
నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా గంజాయి కల్చర్ జోరుగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా గంజాయి కల్చర్ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. దీంతో టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర (Andhra)-ఒడిశా (Odisha) సరిహద్దులో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. భద్రాచలంలోని కూనవరం వద్ద అనమానం వచ్చిన రెండు బైకులను ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద 9.3 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. అనంతరం రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.






