- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కీలక మలుపు తిరిగిన మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ లపై కేసులు నమోదు చేసిన పోలీసులు
![కీలక మలుపు తిరిగిన మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ లపై కేసులు నమోదు చేసిన పోలీసులు కీలక మలుపు తిరిగిన మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ లపై కేసులు నమోదు చేసిన పోలీసులు](https://www.dishadaily.com/h-upload/2024/12/10/399325-cace-on-manchu-family.webp)
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం(Manchu Family Controversy) హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు(Mohan Babu), మనోజ్( Manchu Manoj) లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ నుండి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు(PahadiSharif Police).. మంగళవారం.. రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై.. మనోజ్(manoj)తో పాటు భార్య భూమా మౌనిక(bhuma mounika)పై కేసు నమోదు కాగా.. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై..మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఇష్యూపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. కాగా మోహన్ బాబు యూనివర్సిటీ(Mohan Babu University)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని.. వాటిని ప్రశ్నించి బాధితులకు అండగా ఉన్నందుకు తనపై దాడులు చేస్తున్నారని ఈ రోజు ఉదయం.. మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు.
Read More...
మంచు మనోజ్ సంచలన ఆరోపణలు.. తనకు న్యాయం చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు రిక్వెస్ట్