- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UREA: యూరియా కోసం వచ్చిన రైతుపై పోలీస్ దాడి.. రైతుల ఆగ్రహం
యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న రైతుపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు యూరియా (Urea) కష్టాలు తప్పడం లేదు. ఒక్క బస్తా యూరియా కోసం రాత్రనకా పగలనకా క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. యూరియా కోసం రైతులు (farmers) ఇబ్బందులు పడుతుంటే మరో వైపు రైతులపై పోలీసుల దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో రైతుపై ఓ పోలీసు ప్రతాపం చూపాడు. యూరియా కోసం క్యూలైన్‍లో నిల్చున్న రైతుపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి (police attack) చేశాడు. నల్గొండ జిల్లా పెద్దపూరలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. రైతుపై దాడి చేసిన కానిస్టేబుల్‍పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.
Next Story






