HYD: స్పా సెంటర్ ముసుగులో కొందరు గలీజు పనులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్లలో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేశారు.

HYD: స్పా సెంటర్ ముసుగులో కొందరు గలీజు పనులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police) పరిధిలోని స్పా సెంటర్లలో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేశారు. స్పా సెంటర్(Kukatpally Spa Centers) ముసుగులో గలీజ్ దండా చేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. వ్యభిచార ముఠాలపై పోలీసులు నిఘా ఉంచి వరుస దాడులు నిర్వహిస్తున్నా.. కొత్త కొత్త దారుల్లో పాడు పనికి పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూడటంతో పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.

Next Story