- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయవద్దని తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయవద్దని తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు ధర్మాకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు ధర్నా చేస్తున్న ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కల్వకంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తరవాత ఇటీవల టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని ప్రకటించిన తరవాత ఆమె ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పోటీగా ఆమె నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తుస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగటంతో రైతుల పక్షాన ధర్నాకు దిగారు.






