జస్ట్ మిస్.. వరుడి ముచ్చట తీరలే.. ‘దిశ’ కథనంతో అడ్డుకట్ట

by Bhoopathi Nagaiah |

ఓ యువకుడు.. ఇద్దరు అక్కాచెళ్లెళ్లను పెళ్లి చేసుకోవాలనే ముచ్చటకు అడ్డుకట్ట పడింది

జస్ట్ మిస్.. వరుడి ముచ్చట తీరలే.. ‘దిశ’ కథనంతో అడ్డుకట్ట
X

ఓ యువకుడు.. ఇద్దరు అక్కాచెళ్లెళ్లను పెళ్లి చేసుకోవాలనే ముచ్చటకు అడ్డుకట్ట పడింది. శిశుసంక్షేమ అధికారులు పెళ్లి జరగబోయే ఇంటికి చేరుకుని వధూవరులను స్టేషన్‌కు తరలించారు. ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకోని సంసారం చేద్దామనుకున్న యువకుడికి దిశ కథనం షాకిచ్చింది. అధికారులు ఎంట్రీ ఇచ్చి అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వైరల్ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట వద్దకు ప్రజలు ఎవరూ రావొద్దని వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో ఇవాళ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందడం కోసం కర్రెగుట్టపై బాంబులు పెట్టామని తెలిపారు. ప్రజలు షికార్(వేట) కోసం కర్రెగుట్టపైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. ఇంకా ఆ లేఖలో ఏం రాశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబానికి పరామర్శించేందుకు జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో ఇవాళ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చిన విషయం తెలిసిందే. అదే హెలికాప్టర్ లో జగన్ బెంగళూరు వెళ్లాల్సి ఉంది. జగన్ పాపిరెడ్డిపల్లి వెళ్లి తిరిగొచ్చే సమయానికి హెలికాప్టర్ డ్యామేజ్​ అయింది. హెలికాప్టర్​ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పైలెట్లు అందులో ప్రయాణానికి తిరస్కరించారు. పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్‌ బెంగళూరుకు వెళ్లిపోయారు. హెలికాప్టర్ ఎందుకు ధ్వంసం అయిందో ఈ లింక్ ఓపెన్ చేసి మీరే చదవండి.

కులం తక్కువ వారికి, జంజం లేనివారికి పూజలు చేయనని పురోహితుడు వేదిక పైనుంచి వెళ్లిపోయాడు. ఈ అమానుష ఘటన ఖమ్మంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు బాధితుడు బాణోత్ సైదులు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

Next Story