కూలీల వేషంలో మావోయిస్టులు.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న పోలీసులు

by Gantepaka Srikanth |

తప్పించుకుని తిరుగుతున్న మావోయిస్టుల కోసం తాండూరు ప్రాతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.

కూలీల వేషంలో మావోయిస్టులు.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న పోలీసులు
X

దిశ, తాండూరు: తప్పించుకుని తిరుగుతున్న మావోయిస్టుల కోసం తాండూరు ప్రాతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో నలుగురు మావోయిస్టులను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక లేడీ మావోయిస్టు‌పై అక్కడ కేసు నడుస్తున్నట్లు సమాచారం. ఆ నలుగురు మావోయిస్టులు తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధి రుక్మాపూర్‌ రైల్వే స్టేషన్‌లో ఇటీవల కూలీ పనులకు దిగారు. గత 10 రోజులుగా వారు ఇక్కడే పనులు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు, తాండూరు పోలీసుల సహాయంతో అపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రుక్మాపూర్ రైల్వే హెడ్ క్వార్టర్‌లో దాడులు నిర్వహించారు. నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకొని మహారాష్ట్రకు తరలించారు.

Next Story