పోలీసులు మంచొళ్లే రేవంత్.. వాళ్లని మీరే చెడగొడుతున్నారు.. సీఎం ట్వీట్ కు బీఆర్ఎస్ నేత కౌంటర్

by Ramesh Goud |
పోలీసులు మంచొళ్లే రేవంత్.. వాళ్లని మీరే చెడగొడుతున్నారు.. సీఎం ట్వీట్ కు బీఆర్ఎస్ నేత కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులు మంచొళ్లే కానీ వాళ్లని మీరే చెడగొడుతున్నారు రేవంత్ రెడ్డి అని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025 (India Justice Report-2025) నివేదిక ప్రకారం తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police Dept) అత్యుత్తమ పని తీరుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో తెలంగాణ పోలీసులకు శుభాకాంక్షలు చెబుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్ పై స్పందించిన ఆర్ఎస్పీ.. రేవంత్ రెడ్డికి కౌంటర్ (Counter) ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ పోలీసులు దేశంలోనే మంచోళ్లు, కానీ వాళ్లని తమరే చెడగొడుతున్నారన్న విషయం పాపం ఇండియా జస్టిస్ -టాటా ట్రస్ట్ (TATA Trust) వాళ్లకు తెలవకపోవచ్చు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. అలాగే ఎంఎంటీఎస్ (MMTS)లో మహిళలపై అత్యాచార యత్నాలు, సామూహిక అత్యాచారం, మత కల్లోలాలు, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే రక్షణ కవచంగా ఉండడం, మీరెన్ని బూతులు తిట్టినా కేసు పెట్టకపోవడం, ఇవన్నీ వాళ్లకు మీరు తెలవకుండా జాగ్రత్త పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా మీరు కొన్ని రోజుల క్రితం, యంగ్ ఐపీయస్ (Young IPS)లు ఏసీ రూముల్లో కూర్చుని మీలాగే భూదందాలు చేస్తున్నారని అన్నారు కదా? మరి ఈ బెస్ట్ అవార్డు ఎట్లా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ నిలదీశారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డి.. అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. 'ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025' ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని, టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.

శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని పేర్కొన్నారు. రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రాసుకొచ్చారు.



Next Story

Most Viewed