- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల వేళ పోలీసుల దూకుడు.. రూ.1.29 కోట్లు నగదు పట్టివేత.. డీజీపీ సంచలన ప్రకటన
రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. వెబ్ కాస్టింగ్ జరిగే విధానాన్ని, ఎన్నికల బందోబస్తు వివరాలను డీజీపీ కార్యాలయంలో మంగళవారం వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా చెపట్టిన తనిఖీల్లో రూ. 1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ. 15.7 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, రూ. 28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామని, ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక మైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మక మైనవిగా గుర్తించినట్లు డీజీపీ, ఏడీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు. టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాలకు చెందిన సుమారు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు సాగుతున్నాయని, ఇందుకోసం 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయని, ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. వివిధ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న 398 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందిందని డీజీపీ తెలిపారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై స్పందన..
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం పై డీజీపీ వివరణ ఇచ్చారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ , నాగపూర్ ఫోరెన్సిక్ బృందాలు ఫోరెన్సిక్ సర్వర్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. 2015 లో నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టు సమర్పించినట్లు వెల్లడించారు.ఈ విషయంలో ఫోరెన్సిక్ డీజీ కూడా వివరణ ఇచ్చినట్లు పేర్కోన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు. ఎఫ్ఎస్‌ఎల్ 7మెటిరియల్స్‌లో కూడా రిట్రైవ్ చేస్తామని తెలిపారు . మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని వెల్లడిచారు. కొన్ని రోజులలో ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై పూర్తి నివేదికలు మీడియాకు అందజేస్తామని తెలిపారు..






