- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్, కేసీఆర్ ను తిట్టేందుకు కవిత చాలు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ బీఆర్ఎస్ ని తిట్టడానికి ఆయన కూతురు కల్వకుంట్ల కవిత చాలు.. మాకు ఆ అవసరం లేదు అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

దిశ, భూత్పూర్/దేవరకద్ర/కొత్తకోట : పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ బీఆర్ఎస్ ని తిట్టడానికి ఆయన కూతురు కల్వకుంట్ల కవిత చాలు.. మాకు ఆ అవసరం లేదు అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి రాష్ట్ర పశు సం వరదక, మత్స్యశాఖ మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులను తీరుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ వల్లే పాలమూరుకు అన్యాయం జరిగిందని.. రూ. 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పనులు ఎలా పూర్తి అవుతాయి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలని చూస్తే.. ఇంతవరకు జరిగిన ఎన్నికలలో ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఈ ప్రాంత బిడ్డ.. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు సెలవు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు.
కేసీఆర్ ఏదో ఒక్క రోజు మాత్రమే పనులు చేశారు అని చెప్పారు. ఈ కారణాల వల్లనే ప్రజలు అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పారన్నారు. ఆయనను తిట్టడానికి ఆయన కూతురు కవిత చాలు.. మా అవసరం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద ఆరువేల కోట్లు, ఉచిత బస్సు కోసం పదివేల కోట్లు, రైతుల కోసం 20,000 కోట్లు, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు 20 వేల కోట్ల తో ఇంగ్ ఇండియా పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేపట్టింది అన్నారు. మరో 20 రోజులలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికలలో సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని పార్టీలకు ఓట్లు వేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. పనిచేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మునిసిపల్ ఎన్నికలలో గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని కోటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలిచాము అని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికలలో నిరంతరం అభివృద్ధి కోసం పరితపిస్తున్న మీ ఎమ్మెల్యే జిఎంఆర్ సారధ్యంలో మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటాలి అని కోటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
ఇది అభివృద్ధి పండగ : మంత్రి వాకిటి శ్రీహరి
కాంగ్రెస్ పాలన లో రాష్ట్రంలో అభివృద్ధి పండుగలు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీహరి అన్నారు. అత్యధిక వరి దిగుబడిని సాధిస్తూ దేశానికి సన్న బియ్యం అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. మహిళలు, రైతులు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు. మక్తల్ నియోజకవర్గంతో పాటు దేవరకద్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి శ్రీహరి చెప్పారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహరి ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి భూత్పూర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.భూత్పూర్ మున్సిపాలిటీలో 18 కోట్లు, దేవరకద్రలో 25 కోట్లు, కొత్తకోటలో 15 కోట్ల రూపాయల అంచనాలతో పట్టణాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
మంత్రులకు ఘనస్వాగతాలు
పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు హాజరైన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీహరి కి భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీలలో ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే జిఎంఆర్ సారథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా మంత్రులకు స్వాగతాలు పలికి. గజమాలలతో సన్మానించారు.






