- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోచారం డ్యాంకు గండి.. డేంజర్ లో 14 గ్రామాలు
కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు గండి పడింది.

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు గండి పడింది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బుధవారం ఉదయం నుంచి పోచారం ప్రాజెక్టుపై నుంచి 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 75 వేళా క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 1. 5 లక్షల వరద వస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. డ్యాంపై నుంచి నీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న మట్టి కొట్టుకుపోయి, గండి పడినట్టు తెలుస్తోంది.
దీంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న 14 గ్రామాలు డేంజర్ లో పడ్డాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణమైన కట్ట తెగిపోయే అవకాశం ఉండటంతో, అధికారులు గండి పూడ్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా మంత్రులు సీతక్క, పొంగులేటి, ఉత్తమ్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.






