- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ వేదికలపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు..
తెలంగాణ చేనేత కళా వైభవానికి అంతర్జాతీయ వేదికపై మరోసారి అరుదైన గౌరవం దక్కింది.

- ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి ప్రధాని మోదీ పోచంపల్లి సిల్క్ స్టోల్ బహుమతి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ చేనేత కళా వైభవానికి అంతర్జాతీయ వేదికపై మరోసారి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సాంప్రదాయ కళలు, హస్తకళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణి అద్భుతమైన పోచంపల్లి సిల్క్ స్టోల్ ను బహుమతిగా అందజేశారు. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ దేశాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ప్రత్యేక కానుకను సమర్పించారు. తెలంగాణలోని భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు అత్యంత ప్రతిభతో, సాంప్రదాయ 'ఇక్కత్' డైయింగ్ పద్ధతిలో ఈ పట్టు స్టోల్‌ను వస్త్రాన్ని చేత్తో నేశారు. దీనిపై ఉన్న అద్భుతమైన జ్యామితీయ, పూల డిజైన్లు ఫ్రాన్స్ ప్రథమ మహిళను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్, కళలకు మారుపేరైన ఫ్రాన్స్ దేశ ప్రతినిధులకు.. భారతీయ నేత కార్మికుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రతిబింబించేలా ఈ బహుమతిని ఎంపిక చేయడం విశేషం. ఈ స్టోల్, భారతదేశపు ఘనమైన చేనేత వారసత్వానికి, కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఫ్రాన్స్ దేశానికి ఫ్యాషన్, కళలు, అద్భుతమైన హస్తకళల పట్ల ఉన్న మక్కువ, గౌరవం అపారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, భారతీయ సంస్కృతి, సృజనాత్మకత, అత్యున్నత నాణ్యతతో కూడిన ఈ పోచంపల్లి సిల్క్ స్టోల్ ఫ్రెంచ్ ప్రముఖుల మనసును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కానుక భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ చేనేత కళకు ఈ గౌరవం దక్కడం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ సుసంపన్నమైన వస్త్ర సంస్కృతిని ప్రపంచ దేశాల అధినేతలకు పరిచయం చేయడంలో ప్రధాని ఎప్పుడూ ముందే ఉంటారు. గతంలో కూడా పోచంపల్లి చీరలను విదేశీ ప్రముఖులకు బహుమతిగా ఇవ్వగా, తాజాగా ఈ సిల్క్ స్టోల్ అంతర్జాతీయంగా మరోసారి చర్చనీయాంశమైంది.






