PMJ జ్యువెలరీ చోరీ కేసు: నిందితుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి!

by Malleboina Mahesh |

కరీంనగర్ PMJ జువెలరీలో చోరీకి పాల్పడ్డ నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వారి వివరాలు అందించిన వారికి రూ. లక్ష బహుమతి ప్రకటించారు.

PMJ జ్యువెలరీ చోరీ కేసు: నిందితుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం కరీంనగర్‌లోని PMJ జువెలరీ షాపులో జరిగిన కాల్పులు, చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 12 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు నిందితుల ముఖచిత్రాలను విడుదల చేసిన పోలీసులు, ఈ దారుణానికి పాల్పడింది ఒక అంతర్రాష్ట్ర ముఠా అని నిర్ధారించారు.

నిందితులను పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ కేసులో నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ. లక్ష నగదు బహుమతిని ప్రకటించారు. సమాచారం అందించి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. నిందితుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే 8712670762, 8712670711, లేదా 8712670713 నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని కరీంనగర్ పోలీసులు ప్రజలను కోరారు.

Next Story