ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఫుల్ షెడ్యూల్

by Gantepaka Srikanth |

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఫుల్ షెడ్యూల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. నేడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్​బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెచ్‌ఐసీసీకి వెళతారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరుకానున్నారు. దాదాపుగా రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు హెచ్‌ఐసీసీ నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జహీరాబాద్​ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్​స్మార్ట్​సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, గూడెబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు చేపట్టనున్న జాతీయ రహదారి పనులకు సైతం శంకుస్థాపన చేస్తారు. ఇండియన్​ఆయిల్​కార్పొరేషన్​టర్మినల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్​పనులను జాతికి అంకితం చేస్తారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్​పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. మోడీ పర్యటనకు అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.ఈ భారీ బహిరంగ సభ‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్​ఏర్పాట్లు చేశారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారిగా మోడీ తెలంగాణకు వస్తున్నందున ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే గత 10 రోజులుగా పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​వ్యాప్తంగా కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఆర్చిలతో నింపేశారు. ప్రధాని మోడీ దృష్టిలో పడేందుకు నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాని మోడీ పర్యటన ఇలా...

– నేడు మధ్యాహ్నం 2.50 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

– 3.30 గంటల నుంచి 4 గంటలకు హెచ్‌ఐసీసీలో పలు కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

- 4.10 గంటలకు హైటెక్​సిటీ ప్రాంతంలో నిర్మించిన సాయి సింధూ​ఆస్పత్రిని ప్రారంభిస్తారు.

- 5.10 గంటలకు హెలికాఫ్టర్​ద్వారా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

- 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.

- రాత్రి 7.40 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్ట్‌కు చేరుకుని,​ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్​ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు.

Next Story