- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను వస్తున్నా.. తెలంగాణ, కర్ణాటక టూర్‌పై ప్రధాని మోడీ ట్వీట్
తాను కర్ణాటక(Karnataka), తెలంగాణలో ఆదివారం నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉదయం 11 గంటలకు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగే వార్షికోత్సవ వేడుకల్లో తాను భాగస్వామిని అవుతానని ఆయన తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: తాను కర్ణాటక(Karnataka), తెలంగాణలో ఆదివారం నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉదయం 11 గంటలకు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగే వార్షికోత్సవ వేడుకల్లో తాను భాగస్వామిని అవుతానని ఆయన తెలిపారు. సమాజ సేవ అనే మన సిద్ధాంతానికి అనుగుణంగా, వారు వివిధ రంగాల్లో చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమని ప్రధాని మోడీ కొనియాడారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఆదివారం మధ్యాహ్నం తాను హైదరాబాద్ చేరుకుంటాననని చెప్పారు అక్కడ సుమారు రూ. 9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నానని ఆయన పేర్కొన్నారు. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఇంధనం వంటి కీలక రంగాలకు సంబంధించిన పనులు ఇందులో ఉన్నాయని, అనంతరం 'సింధు ఆసుపత్రి'ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు.
బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు
‘‘ఆదివారం సాయంత్రం నగరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో నేను ప్రసంగిస్తాను. గతంలో బిఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ప్రస్తుతం బిజెపి వైపు చూస్తున్నారు.’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.






