- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‍కు ప్రధాని.. సీఎం చంద్రబాబు, పవన్ ఇళ్లకు వెళ్లనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలకు వ్యక్తిగతంగా వెళ్లనున్నారు.
చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ
హైదరాబాద్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లనున్న ప్రధాని, ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై ఈ సందర్భంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో, వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్ కల్యాణ్ కు పరామర్శ
అనంతరం ప్రధాని మోదీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ప్రధాని ఆయనను పరామర్శించనున్నారు. పవన్ కల్యాణ్‌కు ప్రధానితో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా, మోదీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం విశేషం.






