- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు హైదరాబాద్ లో వర్చువల్ మీటింగ్ కు ప్రధాని మోడీ
by Prasad Jukanti |
ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ లో జరగబోయే ఓ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరుకాబోతున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ లో జరగనున్న ఓ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై రచించిన మూడు పుస్తకాలను పీఎం విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ది హిందూ హైదరాబాద్ ఎడిషన్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్ కుమార్ రచించిన "వెంకయ్య నాయుడు - లైఫ్ ఇన్ సర్వీస్", వెంకయ్య నాయుడు మాజీ కార్యదర్శి సంకలనం చేసిన 'సెలబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఎం.వెంకయ్య నాయుడు యాస్ ఏ 13 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా', సంజయ్ కిషోర్ రచించిన "మహానేత - లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు' పుస్తకాలను విడుదల చేయనున్నారు.
Next Story






