పాశమైలారం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

by Muthe.Rajitha |   (  Updated:2025-06-30 10:08:59  IST  )

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) ఘటనలో 12 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు.

పాశమైలారం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) ఘటనలో 12 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు.

Next Story