TG: తెలంగాణలో అందుబాటులోకి అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌.. జెండా ఊపి ప్రారంభించిన మోడీ

by Prasad Jukanti |

TG: తెలంగాణలో అందుబాటులోకి అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌.. జెండా ఊపి ప్రారంభించిన మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌ (Amrit Bharat Express 2.౦ Express) అందుబాటులోకి వచ్చింది. కేరళలోని తిరువనంతపురం నుంచి చర్లపల్లి మద్య రాకపోకలు సాగించే ఈట్రైన్‍ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వర్చువల్‍గా ప్రారంభించారు. దీనితో పాటు మరో ప్యాసింజర్ రైలుతో సహా నాలుగు కొత్త రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. కాగా తెలంగాణలో ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్‌పుర్‌ (బిహార్) మధ్య ఒక అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు సాగిస్తోంది. తాజాగా అమృత్‌ భారత్‌ 2.0 రైలు (నం.17041) ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరిగి అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు తిరువనంతపురం నుంచి రైలు (నంబరు 17042) బయలుదేరి గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ వాసులకు కొత్తగా అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి

Next Story