- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రధాని మోడీ ప్రశంసల జల్లు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) అదరగొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) అదరగొట్టింది. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా (Team India) 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 83 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా శ్రేయాస్ అయ్యార్ (Shreyas Iyer) 62 బంతుల్లో 48 పరుగులు, కేఎల్ రాహుల్ (KL Rahul) 33 బంతుల్లో 34 పరుగులు, శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) 50 బంతుల్లో 31 పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ముచ్చటగా మూడోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘అసాధారణమైన ఆట.. అసాధారణ ఫలితం!, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. వారు టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడారు. అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినందుకు మా జట్టుకు అభినందనలు’. అంటూ ట్వీట్ చేశారు.
అభినందనలు తెలిపిన రాష్ట్రపతి..
ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అభినందిస్తూ ‘X’ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. మూడుసార్లు ట్రోఫీని గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. క్రికెట్ చరిత్ర సృష్టించినందుకు ఆటగాళ్లు, యాజమాన్యం, సహాయక సిబ్బంది అత్యున్నత ప్రశంసలకు అర్హులు. భారత క్రికెట్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.






