- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు.. ప్రధాని సహా ప్రముఖుల విషెస్
by Naga Rani Yarlagadda |
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా.. ప్రముఖ రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా.. ప్రముఖ రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. రేవంత్ కు ఆ దేవుడు ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేవంత్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక నోట్ విడుదల చేశారు.
పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, స్పీకర్ ఓం బిర్లా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి బండిసంజయ్ సీఎం రేవంత్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అమ్మవారి దయ, దీవెనలు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని, ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
Next Story






