- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుంగపూర్ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా
పిల్లలు ఎలా చదువుకుంటు న్నారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఆప్యాయంగా పలకరించారు.

దిశ, ఆసిఫాబాద్ : పిల్లలు ఎలా చదువుకుంటు న్నారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఆప్యాయంగా పలకరించారు. బుధవారం తిర్యాణీ మండలంలోని సుంగపూర్ గ్రామంలోని ఆశ్రమ సాటిలైట్ పాఠశాల ఆయన సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పాఠాలు బోధించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యాయ సిబ్బంది సైతం అదేస్థాయిలో విద్యాబోధన చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను సందర్శించడంతో పాటు జన్ మన్ పథకం ద్వారా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీంతో గిరిజన గ్రామాల విద్యా. వైద్యంతో పాటు ఇతర అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ. ఎమ్మెల్యే కోవలక్ష్మి లతో కలిసి గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తుల నుంచి ఘనస్వాగతం లభించింది.ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు. గుస్సా డీ నృత్యాలతో స్వాధీనం పలికారు.






