- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు 5వేల ఈవీ ఆటోలు ఇవ్వాలని యోచన: మంత్రి పొన్నం
హైదరాబాద్ నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. శనివారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు 5 వేల ఈవీ ఆటోలు ఇచ్చే యోచన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీంతో హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. అలాగే, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడుతున్నారని మంత్రి పొన్నం వారి సేవలను కొనియాడారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలందించేందుకు వారు పాటిస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాలను గ్రహించి ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.






